పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/164

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వీ తీ యా శ్వా న ము


పౌరాణిక గాథా ప్రబంధనిబద్ధములయిన యిట్టి కథలు "పెక్కులుగలవు. వానిలోఁ గొన్నిం నిట విస్తరింతు, దత్తాప ధానుండవై రక ర్ణింపుము. ఆకర్ణించిన పిమ్మట సత్యంబు బోధపడఁగలదు—


ధరణీంద్రుఁ డై నట్టి దశరథున కరదం
               బులు పది గలవంచుఁ బలుకునటుల
దై త్యేశుఁ బైపై నట్టి దశకంటుసకుఁ గంఠ
                ములు పది కలవంచుఁ బలుకునటుల
దితిజ సేనాని త్రిశిరునకును మూఁడు
              తలలు గలవటంచుఁ బలుకునటుల
ఋషిపుత్రుఁ డైనట్టి ఋష్యశృంగున కొక్క
                మనుబోతు కొమ్ముండే ననెడునటుల
వినుము ప్రాచీనబరికి వేయిగనులు
                కలవని పురాణములు పల్కు గంఠ మెత్తి
వేయికన్నులు నాకుఁ గన్పింప లేదు
                 పొడలుమాత్రము కన్పించె నొడలినిండ,


మాండూక్యముని లోకమాన్యుండు మాండూక
             ముసకు జన్మించినాఁ డనెడిరీతి
సుశ్లోక చరితుండు శుక యోగి శుకిగర్భ
             మున సంభవించినాఁ డనెడి రీతి

33