పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/161

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము


శ్రోతియ నరుడైన సోమ యాజులు సాని
కొంప తల్పులు చేతఁ గొట్టుచుండ
వీరగంథముతోడఁ బెసగి కూలిన మల్లు
సానివాడఁ బచారు సల్పు చుండ

యగ్నాయాగాదులు నాచరించిన యోగి
రోప డంతుల యిండ్లు రోయు చుండ
నిట్రించి తపములో నెగ్గిన జటిలుండు
బొజుగుబోటుల పౌజు పొంత నుండ


దారి తేలియక జడదారి తారు చుండ
గొంటె తెరగంటి కన్నె గన్గొట్టు చుండ
ననువు కాడట్టె పెడనవ్వు నవ్వు చుండ
నల్లకల్లోలమై యుండె నాక పురము

విసవిస సోమయాజి యొ క వీథిని బోవుచు వేశ్య కాంతతో
గుసగుసలాడుటెల్లఁ గని కోపనగావున సోమందమ్మయున్
బుసబుసలాడిభూస్థలిని బోకడ నిట్టివి యున్నె యంచు దా
దపతస పూరటీరమొక దానిని దారెను దొంగదారినన్

ఎదురుగ మదిరాక్షులకే
నొదిగి యొదిగిపోవ వారి యూర్పులవలిచే
మదిరానవ వాసనచే
మది మదిలో లేక రారుమారుగ నుండెన్.


30