పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ స్వామి గారు

ఇలా వుంటావేం ?” అని అడిగింది. గ్రామస్వామిగారు “అయితే మీవాళ్లు మా దేశం వచ్చినప్పుడు ధోవతులు కట్ట రేం ?”


ఆమె మాట్లాడ లేదు ! అవి యుద్ధంరోజులని చెప్పాం. ఒకరోజు ఒక యువతి రామస్వామిగారి దగ్గరకువచ్చి చందా అడిగింది. ఎందుకూ?” అని ప్రశ్నించారు రామస్వామిగారు. “దెబ్బలుతిన్న సోల్డర్ల కోసం” అన్న దాయువతి. *నయంచేయించుకుని మమ్మల్ని -హింసించటాని కేగా? నేనివ్వను అన్నారు. రామస్వామిగారు.


డబ్లిన్ గ్రంథాలయాలలో పఠసం; శంబుక వధ పీఠిక యీ గ్రంధాలయాల్లోనే తయారు. బారిష్టరుపట్టా.


ఇంగ్లండు ముఖ్యపట్టణాలు, ఉత్తర దక్షిణ ఆ ప్రికాలూ, సింగపూర్, సిలోన్ వగైరాప్రదేశాల పర్యటనం. ..

దక్షిణాఫ్రికాలో ఒక సంఘటన:


డర్బన్ లో స్టీమరాగింది. ఆసియా వాసులు అక్కడ దిగకూడదని ప్రభుత్వం వుత్తరువు జారీచేసింది, | రామస్వామిగారు అవమానంతో కంపించిపోవటం : నేనేం దొంగనా ? ఆసియావాసులంతా దొంగలా !”


ప్రభుత్వ ప్రతినిధి వచ్చి 'ప్యాస్ పోర్టు' చూపమని అడిగాడు. నోటీను ఉపసంహరించుకొనేవరకూ చూపనని రామస్వామిగారి జవాబు,


14