పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/146

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వీతీ యా శ్వాసము


కావునఁ గుతలం బెట్టెటో
వేవేగన్ గ్రొచ్చి త్రవ్వి ద్వీట్చక్రంబున్
జావఁగఁగొట్టి హయంబున్
భూవరుసకు నీయవలయుఁ బోడిమి ససఁగన్,


అగుసఘు సంచు రాకొమరు లప్డపుడే కొఱముట్టుతెచ్చి, వా
రగణిత శక్త సంపద నహర్నిశలు ధర గ్రొచ్చి గ్రొచ్చి యే
పగిదిని నై న" ఘోటకముఁ బట్టి సృపాలవతంను యజ్ఞమున్
ము/గిసెడు నట్టు చేయుటకుఁ బూనిరి క్రొవ్వి త దేక చిత్తులై


బొరియలు పెట్టి తాల్మిగొని భూమిని ద్రవ్వఁగ రాతీలోపలన్
వర'లెడి కప్పరీతి నొక వైపు గోచరమయ్యే ముంగలన్
దురగ మొకండు మౌనికులదూర్వహుఁడౌ కపిలుండు ధారుణీ
శ్వరతనుజాతులందరును భావురే! "బాపురే! యంచునార్చుచున్



గికురించి మనల నీ ఘో
టకముం గోని తెచ్చి యిచ్చటన్ జప మనుచున్
ముకుమూసికొనియె వీఁడని
యేకసక్కెము " లాడుచుండ ఋషిచంద్రుండున్ .


తపము బాసి కోప పరీ తాప పరాభవతప్త చిత్తుడై
కృప యను మాట రోసి తమకించి శపింపఁ గషాయ తాక్షుడై
చపలుల దిక్కు చూచు నెడ సార విహీన వివర్ణ దేహులై
కపిలుని కంటి మంటఁబడి క్రాగిరి, బూడిదిబూడిద యైరి వెంటనే