పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/143

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త వ రా ఈ ము


ఈ చిత్రకథం జెప్పెద
బ్రాచీన కవీంద్రకోటి పల్కినరీతిన్
దూచాలు తప్పకుండఁగ
నీ చిత్తాబ్దమునఁ జేర్చి నిజముం గనుమా,



గంగా వ త ర ణ ము



ఉగ్రమయూఖ సత్కులసముద్భవుఁడై సగర తీంద్రుఁడ
వ్యగ్ర సమగ్రజాగ్రదసి పాఠితవై రినృపుండు, నిగ్రహా
నుగ్రహ శక్తిశాలి, యవనోదిత పాపచయుండు తోల్లి ప్ర
త్యగ్రయశస్వియై భరత ధారుణి నేలె సనాతనంబుగన్.



సగరనృపాలమాళీ భుజసారుఁడుదారుఁడు వైరి వీర వా
వారరు చమూప్రణాశన పరాక్రమ భద్రకళాకులీశలపుం
డగణిత వైభవోన్నతిని నాప్త వచోగతి నశ్వమేధముల్
సుగతులఁ గోరిచేయుటకుఁ జొచ్చెను ముప్పిరి గొన్న వేడ్కతో


క్రించుదనమ్మునన్ రివులు రేఁగి తిరస్కృతిఁ జూపకుండు లా
గెంచి సమస్త శత్రు పృథివీశ్వర సీమల సంచరింపఁగా
బంచెను దివ్యలక్షణ విభాసిత జూతి తురంగరత్నమున్
మంచిముహూర్తమందు బుధమండలి మెచ్చఁగ శాస్త్ర సమ్మతిన్