పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/140

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వీ తీ యా శ్వాస ము


అంత సనంతసాహసంబున, నెడ తెగని మంచుబోట్టు దుమారంబు కన్దప్పుచున్నను, జురుకు చుట్టుకునఁ దేలుగుట్టిన చందాన వడిగండ్లోడలికి నొప్పిగలిగించుచున్నను సరకు చేయక


తారాపథ గమనుడనై
యారూఢగతిం జనంగ సట పై పై నీ
హారావనీర్ధధ్రశ్ర్ంగము
దారికి నడ్డంబయగుచుఁ దానరికట్న్ .


మిక్కిలి యక్కజపాటున
దిక్కులు పరీకించుచుండ దీవ్య చ్చోభా
ధిక్కృత మందరయగు గిరి యొక్కటి
కంపట్టె ముందు నుచ్చంబగుచున్.,


నాలో నాలోచింపఁగఁ
గైలాసము మాట నాకు జ్ఞప్తికి రాఁగా
నైళమ నేలకు డిగ్గుచు
నాలోఁదచ్చైల విభవమరయుచు సటుపై


చూచితిఁ గందళీపిహిత సుందర కందర మందిరావళుల్
చూచితి మాతులుంగతతి లుంగ లవంగల తాకుడుంగముల్
చూచితి సంబ రావరణ చుంబి ధరాధర తుంగ శృంగముల్
చూచితి సిద్ధమౌనీజన శుద్ధ సమిద్ధకుటీర పద్ధతుల్


9