పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/133

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము

పొచ్చెను లేని మిండతల పొత్తయినన్ బహుపాప మంచు వా
క్రుచ్చుచు నాలి ముచ్చులయి కొక్కిరి వేలుపు నాగవాస మం
దిచ్చెడి కమ్మ తావిగల యెంగిలి బాగల మీఁది పేర్మిచేఁ .
గ్రచ్చఱ యజ్ఞముల్ సలుపు బ్రాహ్మణ,దీక్షితులన్ స్మరించెదన్,



మఱచితఁడొల్లి పూర్వకవి నన్యుల నెంచుచు మత్కులీనుఁడౌ
బిరుదుమగండు సాయసము వేంకటనాథ కవీంద్రచంద్రు సం
స్మరణ మొసర్పనైతిని బ్రమాదవశంబునఁ గాస నిప్పుడా
కొఱతను దీర్చికోంటి, నిదిగో ! కుసుమాంజలి యెత్తి వానికిన్,


మాతృభాష వలని మమకారమునఁ జీసి
తెలుఁగు బాసఁ జదివి దేశికవిత”
నుడుల కూర్పునేర్పు నోరూరు నట్టుగా
బలుక నేర్చిన వరె "తెలుగుక వులు.


2