పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/132

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము


ద్వితీయాశ్వాసము


మలమలమాడు పొట్ట, తెగమాసిన బట్ట, కలంత పెట్టగా
విలవిల యేడ్చుచున్న నీరు పేదకు జాలినిఁ జూపకుండ, ను
త్తలపడిపోయి జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్
పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమెచ్చెడదన్ •


చేసిన దోస మీశ్వరుని చింతనచే సశీశియించునన్న వి"
శ్వాసము కల్గి 'రేఁబవలు, పాప మొనర్చుచుఁ దీరినప్పుడే
దో సమయంబునం గలముఁ దొందరగాఁగొని రామకోటినిన్
వ్రాసెడి భక్తకోటి పదపంకజముల్ శరణంబు వేడెదన్,



కామపరీతబుద్ధి గుణకర్మపరీక్షను మాని బ్రాహ్మణ
స్వాములఁ జేసి కొందరిని బానిసలం బొనరించి కొందరిన్
బూమేలు చెప్పి యీ భరతభూమిఁగలం చెడి వర్తమాన హీం
దూమత సంప్రదాయమును దోసిలియొగ్గి భజింతు నిచ్చలున్ •