పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/120

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వా న ము



శాస్త్రుల నెల్ల రాఁబిలిచి శ్రద్ధను జాత సుకర్మముల్ యథా
శాస్రముగాఁగఁజేసి విలసన్నన సౌరభ చందనాగరుల్
ప్రములిచ్చిపంపి బుధవర్యుఁడు "పెద్దలయాజ్ఞ చొప్పుసస్
శాస్త్రి యటంచుఁ బేరి డెఁ ప్రశస్తకలాకుశలత్వ బుద్ధిచే



జనకుఁడదే చేతిమీఁదుగా సోఁకుచున్నఁ
బూటకొకరీతి నిగ్గులపుట్ట యగుచుఁ
గూర్చుతల్లికి గారాల కూచి యగుచుఁ
బుటమరించెను మన శాస్త్రీ, పోసరించి,


బాల్యము చన్నయంత కలపద్దతి శాస్త్రిని విద్యలందుఁ గౌ
శల్యమునుం గడింప గురు సన్నిధి కం పెను దేవశర్మ . చా
పల్యము లేక శాస్ట్రి చదువంగఁ బ్రయత్నముఁ జేసి భావనై
ర్మల్యముతో సదా గురుపరంపరఁగొల్చుచునొక్కభాతిగన్.



అరువదినాలుగు కళలను
గురుముఖమున నేర్చి చదివి కూలంకష సు
స్థిరపాండిత్య ప్రతిభా
పరిణత చిత్తాబ్జు డగంచుఁ బాఱుఁడు చెలఁగెన్,


గానకోవిదుఁ డాశాస్త్రీ, కంఠ మెత్తి
సామగానంబుఁ జేసిన జదలనుండి
తుంబురుండే తంబురటు పై చి త్రుళ్ళుపడుచు
వీనుదోయిని నిక్కించి వినుచునుండు.


119