పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/106

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వాసము


అలిగినేని విప్రుఁ డంబుధి జల మెల్ల :
బుడిలింపఁగలఁడు గడియలోన
వానిఁ జెసకి యెవఁడు బ్రదీకిపోయిన వాడు
సమయకుండ మూడు జగములందు.


అనిన నమ్మహాపతివ్రత మందహాసంబు మోమున కొక వింతశృంగారంబుఁ దెచ్చుచుండ నా బాపని కాకమాటలకు జీకాకువడక –


కొక్కెర రెట్ల వైచెనని కోపదురత్యయ దుష్టబుద్ధిచేఁ
బొక్కిపడంగఁజేసితివి పోరచిగాదె భవ త్తపంబు ! నీ
కెక్కడి బ్రాహ్మణత్వము! మరెక్కడి సద్గతిః యోర్పు లేనివాఁ
డక్కట! బ్రాహ్మణుండగు నెకి యార్యులు విన్న హసింపకుందురే!


శమదమంబులు లేక విజ్ఞాన ధనము .
లేక సమదర్శికత్వంబు లేక యూర.
కిట్టు బ్రాహ్మణుఁడంచు గీపెట్టెనంత
మాత్ర వచ్చు నే బ్రాహ్మంబు? చిత్రమిదియు !


విప్రుఁ డల్గిన లోకములో భీతి పడుట
నేను జక్క గ్రహించితింగాని నీదు
కోప తీవ్రాగ్ని కీలలు కొంగఁ జేఱచు
బెఱప లేవు పాతివ్రత్య శీలవతుల



105