పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/103

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పు రాణము


దుర్వాసోముని? వినవో
గర్వారంభంబుడించి కడు శద్ద మెయిన్
పూర్వాపర విషయంబుల
సర్వము చర్చించి ధర్మ సంగతి వినుతున్,


పతితపావన భాష గీర్వాణభామ
యంచు నెంచుచుంటిమి కాదే ? యందుచేతఁ
బత్తులకుఁ గల్లు సక్కటి పారజూడ
నన్యులకుఁ గల్గునొక్కొ రవ్వవంతయైన !



పామరులై ద్విజేతరులు వర్తిలుచుండిరి గోన సంస్కృతం
బేమి జిఘృక్ష, నైనఁ బఠియింపఁగరాదని వక్కణించు చోఁ
బామరులం దరింపఁగల పాటవమబ్బనీ భాషయేల ? త.
న్నామ విచార మేల? యవధానముతోఁ దలపోసి చూడుమా !


కరము పవిత్రవంతమగు గాంగజలంబుల ముట్టినంతనే
పరమదురాత్మఘోరతర సాపముకూడ నశించు నాగతిన్
సరబడితో ద్విజేతరులు సంస్కృతభాషను నభ్యసించిన'స్
దరణవిధానముంగలుగు ధర్మసమాదరణైక పద్ధతిన్ :


పాణి యొక్కఁడు సంసార బంధముక్తి
స్త్రీల గాంచు నెడల భాషా పరిజ్ఞానమునను
దెలిసియుండియు నయ్యదితెలువకున్న
మనుజుఁ డెందు నిషిద్ధ నర్తనుఁడుకాడి?


102