ఈ పుట ఆమోదించబడ్డది

<poem>
ఆత్మ గొప్పతనము నరయుమోయు
కన్నతల్లి విడువ కర్ణుని కులమేది?
కులము గొప్పకాదు! గుణము గొప్ప! 399

ఎపుడు బుద్ధిగలుగ నపుడె దానముచేయు
మరల బుద్ధియెట్లు మారగలదో.
తనువు దాల్చినంత తనివార దానమ్ము
చేయగలుగువాడె శ్రేష్ఠుడోయి. 400

మంచి లోన మంచి పంచి యిచ్చినవాడు
రొట్ట ముక్క తుంచి పెట్టువాడు
తరుగులేని శోభ తరియించగలుగురా
ధర్మమిదియె నీకు దారి యిదియె 401

మనసు స్వచ్ఛమయ్యె , మరులు దూరములాయె,
భ్రమలు మాసిపోయె, భయముపోయె
అన్ని విడిచిపెట్టి ఆనందమున మునిగి
సంతసించువాని సాటి ఎవరు. 402

హర్షమనెడి ధనము అదనులో దొరికిన
దానిసాటి సొత్తు ధరను లేదు
బాహ్య రత్నమేది బంధమ్ము తెంచదు
మోగమొకటి మదిని సేదదీర్చు. 403

అదను పదునుగాక అరక సేద్యముగాక
నారుబోయి ఫలము చేరబోదు
ఋతువుదెచ్చు ఫలము చతురాననుండైన
తెయ్యి యివ్వలేడు తేరగాదు. 404

ఎందు చిక్కుకునన నెదురేది వచ్చినా
ఎట్టి బాధపెట్టు నెవ్వడైన
భయము విడిచిపెట్టి భగవంతునికి చెప్పు
అజుడు పెట్టినట్లె యగును తుదకు 405

నాది నేనటంచు ‘నర్మిలి’1 పడనేల
నీది యేది భువిని నిలుపగలవు
నాదికానిచోట నీకెందుకీ బాధ
సత్యమిద్ది తెలిసి చనుటమేలు. 406

దాస్య దైన్య దీన దారిద్ర్యములవెల్ల
అధిగమించినాడ అభయదయసు
తేట నీటిలోన తేలెడ చేపనై
సంతరింతు వాని సంగసమున 407

ధైర్యహీనుడైన, ధైర్యవంతుడైన,
కటికపేదయైన, కసరు డైన,
సత్య హీనుడైన, సమ్మోహనుండైన
ప్రభువు భువికినిచ్చు వరము గాదె. 408

అణగి యుండుటెల్ల అల్పమ్ము గాబోదు
లొంగదీయబోకు! లొంగి పొమ్ము !
శివుని త్రాసునందు చితుకువాడే గొప్ప
తత్త్వమెఱిగి మనికి1 దాటవలెను 409

నీరు పల్లమందు నిలచియుండుట కద్దు
వంగి యున్ననాడె గంగ దొఱకు
నిక్కి యున్నవాడు నీటినందగ లేడు
తగ్గియుండు టెపుడు తరుగుగాదు. 410

లొంగియున్న వారు లోనైన వారునూ
దైవ మార్గమెరగి దాపుజేరె!
అగ్రజాతియంచు అహము దేలెడివాడు
గర్వనావ నెక్కి గంగ మునిగె 411

చిన్నయైనవాని చేరదీయుదురంత
చిన్నవానికన్ని చేరగలవు
విదియ చంద్రడున్న వీనుల విందౌను
చిన్నరిక మొనయగ మిన్నగాదె 412

చెడ్డవానికొఱకు దొడ్డగా వెతకంగ
చిక్కలేదు నాకు ఒక్కడైన
<poem>