ఈ పుట ఆమోదించబడ్డది

30

సింహగిరి వచనములు

వాక్పూజలచే దండంబు సమర్పించెను.మీ సంకీర్తన పూజలు చాలింపుఁ" డని పొతకమూరి భాగవతులను కృష్ణమాచార్యులను చరించెను. పొతకమూరి వైష్ణవులు దండెలు తాళంబులు ధరణిపై దించిరి. "అయినను మా నేరుపులు నేరములు, మీ తిరువుళ్ళమున చేపట్టుఁ"డని పొతకమూరి భాగవతులు కృష్ణమాచార్యులకు దండము సమర్పించిరి. అప్పుడు కృష్ణమాచార్యులు దండెయుఁ జిటితాళములు సంధించుకొని, పొతకమూరి భాగవతుల సన్నిధిని యడియేని విన్నవింతునని, యాలాప వర్ణనలతో “నమోనారాయణా" యని (మీ) నామగుణకథలు వచనభావంబునఁ గీర్తించను, ఘుమఘుమధ్వనులు మ్రోయఁగాను దండె మీటుచుఁ దాళంబు లుగ్గడించుచు, పంచమవేదస్మృతులుసు, చాతుర్లక్షగ్రంథసంకీర్తన వాక్పూజలును చేయంగాను, సింహాద్రినాథుండు నిజరూపంబున లీలావినోదుండై బాలత్వంబునఁ బురబాలురలోన బాలుండై , కృష్ణమాచార్యుల తిరుమాళిగ సన్నిధినుండి యాడుచుఁ బాడుచు వచ్చి కృష్ణమాచార్యుల తొడలమీదఁ గూర్చుండెను. ఆ శిశువుం జూచి పోతకమూరి భాగవతులు వితాశులై లేచి మెలమెల్లన సంభాషణ సేయం దొడంగిరి. “కృష్ణమాచార్యులకు సంతానప్రీతి కలదనివిందుము. ఆ బాలుఁడు గాబోలు"నని కడువేడ్కతోఁ దమలోఁ దా మన్వయించిరి. ఆ సమయమున గృష్ణమాచార్యులు "తిరువళి యందున్న యీ బాలుం డెవ్వఁడొకో! నిత్యకృత్యంబుగా స్వామిద్వారసన్నిధిని సంకీర్తన విన్నపము చేతును. ఈ బాలుని స్వరూప మెన్నడును సేవింపలేదు." అని యా పొతకమూరి భాగవతులు వేంచేసిన సమయమందు సింహాద్రి యప్పని సంకీర్తన చేయుచున్నప్పుడు నవరత్న పంచరత్న సంకీర్తనలఁ జెప్పగాఁ, దొడలమీదఁ గూర్చుండియున్న బాలుండు గంటమును, నాకులుసు జేతఁబట్టుకుని వ్రాయఁ దొడంగెను. అంతటఁ బొతకమూరి వైష్ణవుల యనుజ్ఞను గృష్ణమాచార్యులు సింహగిరి నరహరీ సంకీర్తన పూజలు చాలించి స్వామికి దండప్రణామములు సమర్పించి, పొతకమూరి వైష్ణవుల సమీపించి, “పెద్దలు బడలితిరి. అడియని గుడిసెకు వేంచేయుఁడు. మీ "సేవ యడియనికి ప్రసా