ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

25


లనుభవించితిని. కొన్ని దినంబులు కామక్రోధ లోభమోహ మదమత్సరంబుల నభిమానహీనుండనై (యుంటిని) కొన్నినా ళ్ళెదుటివాని నెఱుంగనేరక తన్ను దా నెఱుంగక, నిన్ను నెఱుంగక, నీ మతం బెఱుంగనేఱక, భాగవత ద్రోపహుండనయి, పరమాచార్య కృపచేర నేర్పులేక, యాచార్య శేషముదొరుకక, యజ్ఞానజంతువునై యగోచరంబైన పాపంబుల విహారవ్యాపారచిత్తుండనై, పంచేంద్రియాదుల బంధించ నేరక, పంచతురగంబులఁ బట్టనేరక, నైదుభూతంబులకు నొడంబడికగా, నవద్వారంబులు బంధించనేరక,(యుంటిని). (అప్పుడు) జన్మాంతర కర్మాంతర పవిత్ర పరమవంద్యులైన మీ స్వరూపులైన పొతకమూరి భాగవతులు, నారాయణయ్య, యౌబళయ్య, యచ్యుతయ్య, యనంతయ్య, శ్రీ చెన్నమయ్యంగారలు, శ్రీకృష్ణమాచార్యు లేకాదశావతారంబైన మహామహుఁడుగాను, చాతుర్లక్ష గ్రంథస్వరూపుండనం గాను, నతని సందర్శనసేవ దొరకునో యని యపేక్షించి, ఎంబెరుమానార్ల స్వరూపులైన తదీయులు నడబెరుమాళ్ళస్వరూపులైన స్వాములు, పరమపదనివాసులు పరమపదరాజులు, కాషాయవస్త్రములు ధరియించి, కమండలబులతోడ, దండెయుఁ దాళంబులతోడ, భాస్వరనామంబులఁతోడ, లలాటంబుల తిరుమణి శ్రీ చూర్ణంబులు ధరియించి, యాదివ్యస్వరూపులు సింహాచలమున కేతెంచిరి. ఆ సింహాద్రి జగదీశ్వరుం డంగరంగ వైభోగదాయకుండు, శ్రీరంగశాయి, శ్రీపరమపదనివాసుండు. శ్రీ జగన్నాధుండు సింహాద్రియప్ప తిరుపట్టణమందు సూర్య సోమవీధుల శ్రీపొతకమూరి భాగవతులు కృష్ణమాచార్యుల తిరుమాళిగనుఁ గానలేక నెమకులాడుచున్న సమయమం దా పదునొకండవ యవతారుండు లేడొకో! దశావతారుండైన మహాత్ముండు లేడొకో! చాతుర్లక్ష గ్రంథస్వరూపుని సందర్శనము తమ కేవేళ దొరకునొక్కో! ఆ మహాత్ముని తిరువడిగళ్ళెచట నుండునొక్కో! అతని తిరువడిగళ్ళు సేవించుభాగ్యము తమ కెప్పుడు దొరుకునోక్కో! తమ కగోచరంబై న కన్నుల కరవెప్పుడు తీరునొక్కో! తమ జన్మంబు అపునర్జన్మంబుగా నెన్న డీడేరగలుగునొక్కో! అని తమలోతాము సంభాషణ చేసి, అన్వయింపగాను, నా సమయమందున కృష్ణమాచార్యులు తనకు ప్రియకాంత