ఈ పుట ఆమోదించబడ్డది

సింహ వచనములు

23

స్థిరమ్' అనియెడు దానంబును గొంటిని. రోగ దారిద్య్రంబుల చెంపలు గొట్టితిని. ఈ యపకారాదుల మనిచి, చంద్రకాంత పర్వతముమీద నీలపు సింహాసనమట్లు నీవు నాలోపలం బాయకుండవే! అనాథపతీ, స్వామీ, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

31

దేవా, నిర్మలమైన మీకృతుల నెఱుంగక కర్మాదులం బొందెదరు. ఇతర దైవాదుల శ్రుతులందులఁ దగిలి నిషేధమును బొందెదరు. నారాయణుండే పరబ్రహ్మమని తర్కవాదములయందు దలంచి చూచిన దైవాదులు మఱిలేరు. ఏకస్వరూపం బైననాఁడు, ఏకోదకంబైనఁనాడు, బలిని మెట్టిననాఁడు, వటురూపమునుమాని త్రివిక్రమావతారమున నవతరించిననాఁ డా బ్రహ్మాండములు తానే యగునట. ఒక పాదంబున భువనంబులెల్ల గొనునట. మూఁడు మూర్తు లేకమూర్తియైననాఁడు నడుగులో రుద్రాదు లడఁగిరో, దైవాదులు మునిగిరో, పాతాళముఁ జొచ్చిరో, భస్మమైపోయిరో జయవిజయులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్త్రులు శ్రీవల్లభుని చక్రముచేత హతమగుట నెఱుంగరా. ఇతర దైవాదులిచ్చిన పదవులు నిత్యమగునా! శ్రీనాథుం డియ్యఁడా పదవులు? బలి విభీషణులకు, నంబరీష ధ్రువాక్రూరులకుఁ, బ్రహ్లాద నారదులకు, నహల్య, ద్రౌపది మొదలైన పుణ్యకాంతల కిచ్చిన పదవు లభివృద్ధిఁ బొందుచున్నవి. శ్రీకృష్ణ కువ్వారుస్వామీ. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!

32

దేవా, మీకు మొఱపెట్టి విన్నపము చేయుచున్నాఁడను. సంసార మోహబంధములఁ దగులుపడితిని. కర్మానుకూలంబులం బెనగొంటిని. కాంతలమీఁది కోరిక కడవదాయెను, కామాంధకారము కన్నులగప్పెను. కర్మవారిది గడువదయ్యెను. అపరకర్మములకు లోనైతిని అజ్ఞాన జడుండ