ఈ పుట ఆమోదించబడ్డది

8

సింహగిరి వచనములు

నుం గూడుకొని దివ్యదేశంబులయందు స్వామి ప్రభావంబు గోనియాడుచు ఉభయకావేరిమధ్యంబునందు రంగనాయకుల సన్నిధియందు కృష్ణమాచార్యులకు తిరువధ్యయనం బొనరించి, ఆ మీదట సాలోక్య సామీప్య సారూప్య కైంకర్యపరులై పరమపదంబునకు జనుదెంచిరి. ఇది ఉత్తరభాగ సంకీర్తన. అనుదినంబును మీ దివ్యనామసంకీర్తన యెవ్వరు పఠించిరేని, ఎవ్వరు వినిరేని, ఎవ్వరు వ్రాసిరేని ఆయురారోగ్యైశ్వర్యపదవులు దయచేసి ఆమీదట కాలాంత్యంబున పరమపదంబు ప్రసాదింతుమని(న) జగదీశ్వరుండు ఆనతిచ్చెను. యతిరామానుజ మునివరం (దా) రారు. అనాదిపతీ సింహగిరి నరహరి, నమో నమో దయానిధీ!

3

హరిః ఓం. దేవా, మీరు తిరువవతరించిరి. మత్యావతారమునకు పూర్వఋషి తండ్రి, శంభావతి తల్లి, మహిందగురువు, ద్వారకాపట్టణము, సోమకాసురుని వధించుట, బ్రహ్మకు వేదంబు లొసంగుట. 1. కూర్మావతారంబునకు డంబకాఋషి తండ్రి, కన్యకాపతి తల్లి, నంజనందనుండు గురువు, మధురాపట్టణము, సముద్రము తరచుట, దేవతాసమూహమునకు ఆమృతము పంచి పెట్టుట. 2. వరహావతారమునకు దిక్కుమాఋషి తండ్రి, పద్మావతి తల్లి. తర్కవాసనుండు గురువు, గుహిడంగరా పట్టణము, హిరణ్యాక్షు వధించుట, భూమిపాలనము చేయుట, 3. నరసింహావతారమునకు అతిదావదన తండ్రి, చంద్రావతి తల్లి, ఫాలలోచనుడు గురువు జంబఋషిపట్టణము, హిరణ్యకశిపుని వధియించుట, ప్రహ్లాదునికి ప్రసన్న మగుట, 4. వామనావతారమునకు అండమాఋషి తండ్రి, నీలావతి తల్లి, ఆకాశఋషి గురువు, ఆకాశమే పట్టణము. బలివధించుట, ప్రజారక్షణము సేయుట. 5. పరశురామావతారమునకు జమదగ్ని తండ్రి, (జమః) రేణుక తల్లి, మహిందవుండు గురువు, కొల్లాపురి పట్టణము, కార్తవీర్యుల వధించుట, రేణుక శోకవిలాస(ప)ము జూ(బా)పుట. 6. రామా వతారమునకు దశరథుడు తండ్రి, కౌసల్య తల్లి, వసిష్ఠు గురువు, అయోధ్యా