ఈ పుట ఆమోదించబడ్డది

సింహగిరి వచనములు

33

మీ తిరువక్తృమునను నన్ననుగ్రహించుఁడు. ఇంతే నా విన్నప" మని, పొతకమూరి భాగవతులకు సాష్టాంగదండప్రణామంబు సమర్పించి, “యో మహాత్ములారా, వేంచేయుం"డని యనినప్పుడు పొతకమూరి వైష్ణవులు హస్తంబులఁ దమదవడలు వాయించుకొనుచు, 'మాకాచార్యాపచారంబు లేల మోపుగట్టెదవు? ఓ మహాత్మా' యని, కృష్ణమాచార్యుల కినుమడి ముమ్మడి దండములు సమర్పించి, యాతని యానతి యుంచుకొని మగుడ శ్రీయహోబలమునకు వేంచేసిరి. పొతకమూరి వైష్ణవుల వీడ్కొని సింహాద్రినాథుని నగరికి నేతెంచి, సింహాద్రినాథుని సందర్శించి దండప్రణామంబు సమర్పించి, 'యీ మాయా ప్రపంచం బెఱుంగలేను. పుట్టించుచు గిట్టించుచు యమునిచేత దెబ్బలకు లోనుజేతువు. యమునిచేత నన్ని(బాధల) నేకవేలేండ్ల నుభవించితిని. నాడు మీరు లేరో! నేను లేనో? సుఖదుఃఖంబుల బొంది, దుఃఖజీవుండనై మీ దయకు లోనై మిమ్ము గానలేక, పంచమహాపాతకంబులలో మునుఁగుచుండఁగాను, మా పరమాచార్యులైన పొతకమూరి భాగవతులు వేంచేసి మిమ్ముం గనిపించిరి. వారి మహత్త్వమువలననే వెనుకటి కర్మములు వీడ్కొంటిని. నీవు బొంకుల కంచమవు. లంకచెఱుపు మర్కటుండవు. నిన్ను నమ్మలేను. నీ చాతుర్లక్షగ్రంథసంకీర్తన పూజలకు లక్షయేబదివేలు కొదువ. ఆ సమయమందు మీఋణం బెట్లుండునో? మీయనుజ్ఞ యెట్లుండునో? ఇప్పుడే నాకు సాయుజ్యము గృప సేయుఁడు. సర్వాపరాధములు, పొతకమూరి పరమాచార్యుల కృపవలననే మీ తిరువుళ్ళమున ననుగ్రహింపుడు. ఇంతే నావిన్నపము. విన నవధరింపుఁడ'ని క్షీరాబ్ధిశయనుని వీడ్కొనెను. క్షీరాబ్ధివటపత్రశయనుండు భూకాంతసమయవశస్తుండై సింహాద్రిజగదీశ్వరునకు విన్నవించె. పొతకమూరి భాగవతులయనుజ్ఞ వలననే యీ యపచారానపచారములు — మాతిరువుళ్ళమున కొలిపిన మీకు సాయుజ్యమిత్తును. సర్వమునకును, సర్వమైన యెందులకును నవధరించి నట్టి నాయురమున వెలింగెడు (శ్రీకాంతకును) భూకాంతకును దప్పుదును. సాలోక్యసామీప్యసారూప్య పదవులిత్తును. సమయ మొనరింతును. ఇందుకుఁ దప్పితినా, పదుగురాళ్వారులకును, పదముగ్గురు భాగవతులకును దప్పుదును. (మీకు) పదవిగనిపింతును. ఇందుకు దప్పితినా పొతకమూరి