పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/75

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

తమువారు కాకిబంగారము, ముచ్చరేకు మొదలగువానితో నద్భుతముగ బందిళ్లు వేయుట కలదు. నల్లగా నుండుటను బట్టి యతనిని రాక్షసుఁ డని తలంచిరి.

ధర్మరాజు రాజసూయయాగము చేయుటకుముందీ యర్జునుఁ డుత్తరదిక్కునకుఁ బోయి జయించి వచ్చెను. రెండవ జూదము ననంతరమున నరణ్యమునకుఁ బోవునపుడు యుద్ధమున గర్ణాదిదుర్జనులను జంపుదు నని ప్రతిజ్ఞ చేసెను.

అరణ్యవాసమునం దీయర్జునుఁడు శివునికొరకు దపస్సు చేసి యతనితో యుద్ధము చేసి మెప్పించి యతనివలన బాశుపతాస్త్రలాభమును బొందెను. ఆపయి నితరదిక్పాలకుల వలన మఱికొన్ని యస్త్రములనుఁ బడసెను. ఆపిమ్మట నింద్ర లోకమున కేగి యచట నివాతకవచులను సంహరించె ననుగథ గలదు. ఆవిషయ ముపోద్ఘాతమునఁ జర్చించి పరిష్కరింపఁబడి యున్నది.

దక్షిణగోగ్రహణనివారణార్థము విరటరాజుతోఁ దన సోదరులు నలుగురు నేగినపిమ్మట నుత్తరమం దున్నగోవులరక్షణముకొరకు నీయర్జునుఁ డుత్తరునకు సారధిగా నుండి యేగి కురుసేనను జూచి జడిసినయుత్తరుని దిట్ట దీర్చి తనకు సారధిగాఁజేసికొని కౌరవులతో యుద్ధముచేసి గోవులను మరల్చెను. ప్రభువుయొక్కగాని తనయన్నయొక్కగాని యాజ్ఞ లేకుండగనే