పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi

నదికాదనియు నిది యార్యులుత్తర హిందూస్థానమునుండి దక్షిణ హిందూస్థానమునకు వచ్చి దానినిఁ జయించి సింహళద్వీపము వరకును బోవుటను దెలియఁజేయుచున్నదనియు నభిప్రాయపడు చున్నారు. రామాయణములో గల్పితకథ లనేకములుండిన నుండుగాని రామకథ సర్వమన్యార్థ వ్యంజకంబనుట రామాయణ కథనుగూర్చి వ్రాసిన హిందూ పండితుల యభిప్రాయమునకు గేవలవిరుద్ధమయి యున్నది.

ఏ తర్గ్రంథ రచనా పౌర్వాపర్యమును గూర్చివిచారించుటలో భాషాస్వరూపమును, శైలినిఁ బరీక్షింపగా భారతములో గొన్ని భాగములు రామాయణముకంటె స్పష్టముగ బ్రాచీనముగ నగపడుచున్నవి.

మహాభారతములోఁ గురు పాండవచరిత్రము ముఖ్యాంశము గనుక దీనిలోఁ బ్రధానపురుషులను గూర్చి మహారాజావారు తమ యభిప్రాయమును దెలియఁజేసియున్నారు. గ్రంథవిస్తర భయముచే విమర్శితంబులయిన వానిలో గొన్ని విషయములనుఁగూర్చిమాత్రము నాకుఁదోచిన రీతిని వ్రాయుచున్నాను,

కురువృద్ధని పేరు నొందిన భీషుఁడనేక మహాగుణశాలి ఈయన తనతండ్రి సంతోషమునకై రాజ్యమును సుఖమును వదలి బ్రహ్మచారియై పరుల నాశ్రయించి జీవితకాలమును గడ