పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/50

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

రాజ్య మిచ్చెను. అటులఁ బాండవులకు నీయఁబడినయర్థరాజ్యమునకు మొదటినుండి దుర్యోధనుఁ డసూయ గలవాఁడై పాండవులభాగమును స్వీకరింపఁ గోరి, యనేకమాయోపాయములను యోచించి, చివరకు మాయాద్యూతమున వారలరాజ్యమునుఁ దీసికొనెను. అంతటితో దృప్తినొందక కార్పణ్యమే ప్రధానముగ గల యితఁడు బహిష్ఠ యై యుండిన పాండవపత్ని యగు ద్రౌపదిని దుశ్శాసనునివలన బలాత్కారముగ సభకు నీడ్చి తెప్పించి సభాసదులయెదుట వస్త్రవిహీనురాలినిగ జేయింపఁ బూనెను. ఈమహాఘోరకృత్యమువలననే రాజాధిరాజగు నీతనితల తుదను భీమునిచే దన్నఁబడెను. ప్రథమద్యూతా నంతరమున ధృతరాష్ట్రునివలనఁ బాండవులకు వారిరాజ్యము తిరుగ నిప్పింపఁ బడుటనుఁ జూచి యారాజ్యమునే కపటద్యూతమువలన మరల నెన్నిమారులు గెలిచినను వృద్ధుఁడగు తనతండ్రి లోకమునకు జడిసి యిచ్చివేయుచునే యుండు నని తలఁచి దుర్యోధనుఁడు రెండవసారి కపటద్యూతమునకుఁ బిలిచి యెవ్వరోడిన వారు పండ్రెండుసంవత్సరములు వనవాసము చేయుటకును బదుమూడవ సంవత్సరమున నజ్ఞాతవాసము చేయుటకును నట్టియజ్ఞాతవాసములోఁ బయలుపడినయెడల దిరుగ బయి విధమున నరణ్యాజ్ఞాతవాసములు చేయుటకును నొడ్డుగా, బెట్టుకొని యాడించెను. అట్లాడిన యాశకునియొక్క కపటద్యూతమువ