పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/204

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

171

లందఱు నేదో యొకదానినిఁ గురుతుగ నుంచుకొని యారాధించుచున్నారు. కావున బ్రతిమతము నందును విగ్రహారాధన మేదో యొకవిధముగ నుండనే యున్నది.

మన విగ్రహారాధనములలో స్వయంవ్యక్తము దేవతలచేఁ బ్రతిష్ఠింపఁబడిన విగ్రహము సిద్ధులచేఁ బ్రతిష్ఠింపఁబడిన విగ్రహము మనుష్యులచేఁ బ్రతిష్ఠింపఁబడిన విగ్రహము సంతములనియు, నందు దనచే (గాని తసపూర్వులచేగాని) ప్రతిష్ఠింపబడిన విగ్రహము శ్రేష్ఠమనియు, మనమత గ్రంథములలోఁ జెప్పఁబడియున్నది. కావున రామకృష్ణాది విగ్రహములు మనుష్యులచేఁ బ్రతిష్ఠింపఁబడినందున శ్రేష్ఠములు. ఇటులనే శివార్చన చేయువారునుగూడ నర్చాభేదమును గ్రహింపవలెను.

ఏవిగ్రహమును బూజించుచుండినను యుక్త ప్రవర్తన గలవాఁడయి నిండుభక్తితో నారాధింపనివానికి నందలి ఫలము లేదు.

దైవము లేడనువారును, దైవము నేనే యనువారును గాక, దైవము కలఁడు, అతఁడు రక్షకుఁడు, అని నమ్మి కొల్చుచున్న మతస్థులందఱు నించుమించుగ సమానులే యని చెప్పి యీగ్రంథమును ముగించుచున్నాను.



__________