పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/200

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

167

ణాదిశత్రువులను సంహరించిరి. కావున నట్టికార్యమునకు బరాక్రమావస్థతిలోనుండు రామకృష్ణులయారాధనమే నృసింహారాధనముగ నిప్పు డేర్చడుచున్నది.

సాలగ్రామములలో మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామనమూర్తులను మనము గొలుచుచున్నామే ? ఆయవతారములే లేనిచే వీని నేల యారాధింపవలెనని కొందఱికిఁ దోచును. సాలగ్రామమే శ్రీవిష్ణుస్వరూపమని మనము నమ్ముచున్నపు డాకారభేదముచే గలిగిననామముల విషయమున సంశయింపఁ బనిలేదు.

ఈపిదప దదితరావతారములను వ్రాయఁబోవుచున్నాను. అవతారములలోఁ గొన్ని యావేశావతారము లనియు, గొన్ని యంశావతారములనియు మన మతగ్రంథములలో నున్నది. అనఁగా నొక గొప్పకార్యము కొఱకు దాత్కాలికముగ భగవంతునిశక్తి యొక నరునియందు గలుగుట యావేశావతారమని చెప్పుదురు. ఇట్టిదియే పరశురామావతారము. ఇట్టి యావేశములను మనపూర్వులు నమ్ముట కలదు. జన్మమాదిగ వైకుంఠమున కేగువరకు భగవదంశముగలది యంశావతారము. ఇట్టివియే రామకృష్ణుల యవతారములు.

ఇఁక బుద్ధావతారవిషయము :-