పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/198

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

165

అని చెప్పియున్నందున సృష్ట్యాదివివిధకాలములయందు భగవంతు డవతరించియుండునని నమ్మి ముందుగ జలరూపముతో నుండు గోళములో మత్స్యరూపముతో నవతరించెననియు, నందు బంకాదులు పుట్టినపిదప బంకములోను నీటియందును నివసించుట కర్హమైన కూర్మరూపముతో నవతరెంచెననియు, పిదప గొండలు నడవులు నేర్చడినందున వానియందును బురద యందును నుండదగిన వరాహరూపము ధరించెననియు, నటుమీద దామస రాజసులు సృజింపఁబడిరి కావున వారి దుష్టత్వమును వారించుటకు సృసింహరూపమును ధరించెననియు, సాత్వికసృష్ట్యనంతరము వామనరూపమును ధరించి యుందురనియు ఋషులును గ్రంథకర్తలును దలఁచియుందురు. ఈ వామనమూర్తి కురుచవిగ్రహము గలవాఁడని చెప్పెదరు. అనగా దామసరాజసులకంటె సాత్వికులు కురుచవారు. మఱియు వీరు సత్వగుణప్రధాను లయి తమమంచిప్రవర్తనలచే తనే క్రూరులగు తామసరాజసులను లోబరచుకొనిరి. అందుకు నిదర్శనముగ వామనమూర్తి బలిచక్రవర్తిని మంచిమాటలతో సాధించినట్లుగ గథ కల్పింపఁబడినది. ఇక నృసింహావతారవిషయము చెప్పవలసియున్నది. నృసింహశబ్దమునకు నరులలో గొప్పవీరుఁడని యర్థము. కొందరానామమును బట్టియే నరరూపమును సింహరూపమునుగల మిశ్రశరీరము గలిగియుండు