పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/163

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

రామాయణసుందరకాండ పదియవసర్గము 21-22.

శ్లో. దదర్శసకసిస్తస్య బాహూశయనసంస్థితౌ !
    మందరస్యాంతరేసుప్తౌ మహాహీరుషి తావివ!!
    తాభ్యాంసపరిపూర్ణాభ్యాం భుజాభ్యాంరాక్షసేశ్వరః!
    శుశుభే౽ చలసంకాశః శృంగాభ్యామివమందరః!!

24-25, తస్యరాక్షససింహస్య నిశ్చక్రామమహాముఖాత్ !
         శయానస్యవినిశ్వాసా పూరయన్నివతద్గృహమ్ !!
         ముక్తామణివిచిత్రేణ కాంచనేనవిరాజితమ్ !
         మకుటేనాపవృత్తేన కుండలోజ్వలితాననమ్ !!

ఇచట వ్యాఖ్యానకర్తలు రావణుఁడు కామరూపి కావున నేకశిరస్సును ద్విబాహువులును గలిగియుండుట స్త్రీలవినోదముకొర కని సవరించిరి. సదుపాయముకొర కేకశిరస్సుండుట బాగే, అనేక స్త్రీలతో విహరించువాని కనేకములగుచేతు లుండుట, వారితో వినోదము లాడుట కుపయోగమే కదా? కావున నాసవరణను మన మొప్పఁగూడదు.

ఇందునుబట్టి రావణునకు నేకశిరస్సును ద్విబాహువులును గల వని స్పష్టపడుచున్నది. రావణునితల కొట్టఁబడినపిదప మొలచినతలను వరుసగ గొట్టినట్లు స్పష్టముగ రామాయణమున నున్నది.