పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/142

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

109

యాధిక్యముకొరకుఁ జెప్పఁబడినది. మరియు నీగ్రంథకర్త శ్రీరాములవారినిఁ బరాత్పరుని యవతార మని యెప్పుచుఁ గొన్ని యసందర్భములం జెప్పెను. శ్రీభగవంతుఁ డీలోకములో నవతరించుట దుష్టశిక్షణ శిష్టరక్షణార్థమును దమప్రవర్తనను జూచిన వినిన వారందరు దమవలె యుక్త ప్రవర్తన గలిగియుండుటకు నై యున్నది. తనభార్య నొరుఁడు హరించినపు డామె స్థితిగతులం దెలిసికొని హరించినవానిని శిక్షించుట నీతియే. ఆదుఃఖమునకు దాళలేక యడవిలో శ్రీరాములవారు సాధారణ మనుష్యునివలె విలపించిరఁట. అరణ్యములో నిర్జనమైనచోట దమ్ముండును దానును నేల విలపింపవలెను. బాణమును ధరించిన శ్రీరాములవారికిఁ జడిసి సముద్రుఁడు ప్రత్యక్షమైనటుల నీగ్రంథకర్త చెప్పుచు రావణవధకొరకు ససమర్ధనికీవలె నగస్త్యుఁడు శ్రీస్వామివారిని సూర్యుని నారాధింపుమనినట్లును, మాతలి బ్రహ్మాస్త్రమును ప్రయోగింపుమని చెప్పినట్లును రచించెను. ఏమివింత ? తొమ్మిదిసారులు తలను గొట్టినపిదప రావణునితో నొకనాఁడు రాత్రింబగళ్లు శ్రీస్వామివారు యుద్ధమును జేసిరఁట. ఆపైని బ్రహ్మాస్త్ర మేయు మని మాతలి చెప్పినట్లున్నది. తలగొట్టిన దల మొలచుచున్న వానిని శీఘ్రముగ సంహరించుటకుఁ బ్రయత్నింపక యంతకాలమువరకు శ్రీస్వామి వా రేల సాధారణముగ యుద్ధమును జేసియుందురు ! గ్రంథకర్త