పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/132

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

99

గనుక మనకు బూర్ణమైనసంతుష్టి గులుగునటుల నారాథాకృష్ణులు లక్ష్మీనారాయణులయవతారము లని పూజింపఁబడుచున్నారు. ఈవిధముగ నాదిని రుక్మిణియు శ్రీకృష్ణులవారును బ్రజలచేఁ బూజింపఁబడుచుండిరి. భాగవతాదిగ్రంథముల యందు శ్రీకృష్ణులవారు రుక్మిణీయుక్తముగనో లేక యష్టభార్యలనువారితోఁ గలిసియో, లేక మరియేవిధముగ బూజింపఁబడవలెనో చెప్పఁబడి యుండలేదు. ఆగ్రంథములు పుట్టిన యనేక శతసంవత్సరములపిదపనే కాక రాధాకృష్ణులవారి ప్రతిష్ఠకు బిదప మరికొన్ని వందలసంవత్సరములకు బ్రహ్మవైవర్తపురాణ కర్త కా నాలుగుపుస్తకములలో రాధ యనుపేరు కానరానందున దనబుద్ధికొలఁది నీరాథ యెవ రని యోచించుటకు స్వల్పబుద్ధితోఁ బ్రయత్నించి యుండవచ్చును. అటుల నతఁడు పరిశీలించునపుడు ప్రారబ్ధముకొలఁది శ్రీకృష్ణులవారి మేనమామ యగు 'రాయన' యను నతని భార్యకు రాథ యనుబేరు గలిగి యుండినట్లు కనిపెట్టఁబడెను. అప్పటికి భాగవతములోఁ జెప్పఁబడిన రాసక్రీడ మొదలగువ్యభిచార కార్యముల నొప్పించుటకుఁ దగినట్టియు ససత్యములైనట్టియు వారివారికిఁ దోచినట్టికథలతో నతనిమసస్సు నిండియుండవచ్చును. అందు నుండి యతఁడు రాయన యనువానిభార్యయగు రాథను శ్రీకృష్ణులవారితోఁ గలిసి పూజింపఁబడుచుండిన లక్ష్మికిమారుగ