పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/111

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

గాదు. రాయభారమున కేగినపుడు కౌరవసభలోఁగూడ గొందరికి తత్రాపి అంధుఁడగు ధృతరాష్ట్రున కిదివరకే యొక విశ్వరూపమును జూపించెనను నతిశయోక్తికయి యచ్చట విశ్వరూపమును గల్పించి తనకు దోచినట్లు వర్ణించెను. మరియొకచోట నుతంకుఁడను నొక ఋషికి విశ్వరూపమును గనఁబరచిన ట్లున్నది. అపుడు పూర్వ మర్జునునకు జూపిన విశ్వరూపమునే చూపె నని చెప్పుచు విరాట్స్వరూపమును వర్ణించెను. గాని చావబోవుకౌరవులు శక్తిముఖమున జొచ్చునట్లు లేదు. అర్జునునకు నుతంకునకును గనఁబరచినరూప మేకవిధ మని చెప్పుచు గ్రంథకర్త భిన్నముగ వర్ణించెను. కావున నుతంకునికథ బ్రాహ్మణప్రభావముకొరకు నొకయతివలనఁ గల్పింపఁబడియుండును.

అర్జునునకు సారధ్యము జేయుచు నొకనాఁడు మునికోలను మరియొకనాఁడు చక్రమును బట్టుకొని శ్రీస్వామివారు భీష్మునిఁ జంపుటకు బోయినటులను నర్జునునివలన బ్రార్థితు లై తిరుగ నొగ లెక్కినటులను జెప్పఁబడి యున్నది. భారతగ్రంథకర్త కౌరవపక్షపాతి యని యుపోద్ఘాతమునఁ జెప్పఁబడియే యున్నది. ఆయావిషయము లన్నియు నచ్చటనే చర్చించి పరిష్కరింపఁబడి యున్నవి.

ప్రతిపక్షమువారగు పాండవులపక్షమున నున్న యీ శ్రీకృష్ణమూర్తిని నీగ్రంథకర్త తూలనాడక యుండునా?