పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/76

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67

8వ అధ్యాయము.

మార్గమునగాని బ్రహ్మసాక్షాత్కారమునుపొంది, ఈశ్వరాజ్ఞనుసంపాదించుకొనిన పిమ్మట ఎవరైనను ఎక్కడనైనను బోధలు కావింపవచ్చును. ఉపదేశములు చేయవచ్చును. భగవంతుని మహిమను ప్రాపును పొందుటకు అదొక్కటే మార్గము. అటుపిమ్మట మాత్రమే ఎవనికైనను ఉపదేశకుని ధర్మమును చక్కగ నిర్వహించుటకు తగినసమర్ధత చేకూరును.

205. సత్యజ్ఞాన ప్రకాశముచేత విలసితుడగు నతడు మాత్రమే సద్గురువు కాగలడు.

206. ఈప్రపంచమున రెండుతెరగుల మనుజులుందురు:- సిద్ధపురుషులు. వీరు సత్యమును సాధించినవారు. అన్య చింతలను అన్నింటినివిడిచి ఆత్మారాములైమౌనముతో డనుందురు. మఱికొందఱు సత్యసిద్ధినిసాధించి ఆసత్యమును తమతో దాచిపెట్టుకొనిన ఆనందములేనివారై "రండు, రండు" మాతోడచేరి బ్రహ్మానందమును అనుభవింప రండు! అని గొంతెత్తి కోలాహలము చేయుచుందురు.

207. నీటితోనిండినకడవ చప్పుడుచేయదు; అటులనే బ్రహ్మసాక్షాత్కారమునుపడసిన నరుడు అధికముగ మాటలాడడు. అట్లయిన నారదుడు మొదలగువారి విషయమేమి? నారదుడు శుకుడు మున్నగువారు సమాధిదశను పొందినయనంతరము, చాలమెట్లు దిగివచ్చి, దయార్ద్రహృదయులై, ప్రేమ మీర మానవకోటికి బోధసలిపిరి.