పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/44

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35

3వ అధ్యాయము.

గలరు? శక్తినిదర్శింపకుండ, అనగా వ్యక్తమగు భగవత్సామర్థ్యమును గమనింపకుండ భగవంతుని గుర్తింపజాలము.

113. ఎవరేని కనుపెట్టినంతనే దొంగపారిపోవుతీరున, విశ్వభ్రాంతి రూపమాయను నీవు కనిపెట్టిన తోడ్తోడనే అది పారిపోవును.

114. ఒక పుణ్యపురుషుడు త్రికోణాకృతిగల అద్దపుముక్కను గాంచి రేయింబవళ్ళు చిరునవ్వు నవ్వుచుండెడివాడు. కారణమేమనగా, దానిద్వారమున ఎరుపు, పసుపు, నీలము మొదలగువేర్వేఱురంగులు వానికి కాన్పించెడివి. ఈరంగులు వట్టిబూటకములని గ్రహించుటచేత అతడీ దృశ్యప్రపంచము సయితము అటులనే బూటకమని గ్రహించి నవ్వుకొనెడివాడు.

115. హరియనుబాలుడు సింగపుతలనుపెట్టుకొనినప్పుడు భయంకరముగ కాన్పించుటనిజము. అతడు తనచెల్లెలు ఆటలాడుకొనుచున్నతావునకుపోయి, దద్దఱిలిపోవునటుల బొబ్బపెట్టును. వానిచెల్లెలుఅదఱిపడి భీతిల్లి ఆభీభత్సాకారునిబారినుండి తప్పించుకొని బయటపడుటకై కెవ్వునకేకవేయును. కాని హరి తనముసుగును తొలగించివేయగానే, భయకంపితయైయున్న వానిచెల్లెలు తనప్రియసోదరునితక్షణముగుర్తుపట్టి, వానిచెంతకుపరుగిడిపోయి "ఒహో! నాఅనుంగుసోదరుడే!" అనును. ఇట్లేబ్రహ్మము అజ్ఞానరూపమాయయొక్క ముసుగునువేసికొనగా భ్రాంతిచెంది భీతిలిపోయి నానాచేష్టలకు గడంగు లౌకికజనముగతియు ఉన్నది. కాని ఆబ్రహ్మముయొక్క ముఖమును కప్పిపుచ్చు మాయారూపముఖము