పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/396

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

387

41వ అధ్యాయము.

ఎదుట కూర్చుండియుంటగాంచి వందనమాచరించినది. పిమ్మట యశోదాదేవివచ్చిన కారణమేమని రాధ ప్రశ్నింపగా ఆమె తానువచ్చిన విషయము తెలిపినది. రాధఆమెతో "తల్లీ! నీకండ్లనుమూసి శ్రీగోపాలునిరూపును తలంచి ధ్యానముచేయుము. నీవాయనను చూడగలవు" అని చెప్పినది. యశోదాదేవి కండ్లుమూయుటతోడనే భావస్వరూపిణి యగు రాధ తన ఆత్మశక్తిచేత యశోదకు సమాధిదశను ప్రాప్తింపజేయగా ఆమె తన గొపాలుని చూడగల్గెను. అప్పుడు యశోదాదేవి "తల్లీ! నేను కండ్లుమూసినప్పుడెల్లను నాముద్దులగోపాలుని చూడగల్గునటుల వరమిమ్ము" అని రాధను వేడుకొనిరి.

993. పూర్వకాలమున జయపురమందలి శ్రీగోవిందాలయపు అర్చకులు పెండ్లిండ్లుచేసికొనెడివారు కారు. అప్పుడు వారు ఆత్మతేజోవిరాజితులై యుండెడివారు. ఒకసారి రాజు తనకడకురమ్మని వారికికబురుచేయగా "రాజునే యిక్కడికి రమ్మనుడు" అని జవాబుచెప్పిరి. తరువాత వారు పెండ్లిండ్లు చేసికొనసాగిరి. అప్పుడిక రాజుకు వారిని పిలువనంపించవలసిన అగత్యమేలేకుండ పోయినది. వారు తమంతట తామేపోయి "మహారాజా! ప్రభో! మిమ్ము దీవింపవచ్చితిమి. మీ కొఱకై దేవాలయమునుండి ప్రసాదమును తెచ్చితిమి. పుచ్చుకొనుడు" అనుచు వేడవలసివచ్చెను. వారటులచేయక తప్పినదికాదు. పాపము వారేమిచేయగలరు? ఒకనాడు ఇల్లు కట్టుకొను నవసరము మరొకనాడు పిల్లలకు అన్నప్రాశనము చేయువేడుక, ఇంకొకనాడు కొమార్తెల పెండ్లిండ్లు ఇట్లెన్నె