పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

26

మును విశ్వమునుగూడ అంగీకరింపవలసినదే. ఉపమానమును వివరించిచెప్పునెడల మొదటపాలవంటిది సమాధియందు అపరోక్షానుభూతిచే తెలియబడు బ్రహ్మము; వెన్నవంటిది సగుణనిర్గుణబ్రహ్మము; మజ్జిగవంటిది ఇరువదినాలుగు తత్వములతో గూడిన జగత్తుఅగును.

85. యధార్ధము విచారించుచో బ్రహ్మమునకును శక్తికినిగల వ్యత్యాసము భేదములేనివ్యత్యాసము! బ్రహ్మమును శక్తియు ఒక్కటే; ఆభేధము ! అగ్నియు దహనశక్తియు ఏకమైనట్లేఉండును, పాలును పాలతెల్లదనమును ఒక్కటే అయినవిధమున బ్రహ్మమును శక్తియు అభేదమే. మణియు మణియొక్క కాంతియు ఏకమైనవడువున బ్రహ్మమును శక్తియు అభిన్నము - వానిలో ఒకటినివిడిచి రెండవదానిని ఊహాచేయుటయే పొసగదు. వానిని భిన్నముగ భావన చేయనేలేము.

86. భిన్నభిన్నములగు వృత్తి కేంద్రములందు ఐక్యతగాక బిన్నతయే ధర్మముగాన శక్తి భిన్నరూపములదాల్చి ప్రకటిత మగుచుండును. బ్రహ్మము సకలభూతములందును అంతర్యామియైయున్నాడు. చిన్నచీమయందును కలడు. భిన్నత్వమంతయు ప్రకాశమునందుమాత్రమే కలదు.

87. అనేకమై గోచరించు ఏకైకవ్యక్తినాజగజ్జననియే. ఆమె అనంతశక్తిమంతురాలు కావున, కాయికములు, మానసికములు, నైతికములు, పారమార్థికములు అగు నానావిధ శక్తులుగల జీవజగత్తులుగా ఆమెగోచరింపగలదు. వేదాం