పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/288

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

279

40వ అధ్యాయము.

కాన, "నేను, నాది" అను బంధములతో జగమునకు అంటకట్టుకొనియేయుందువు. అజ్ఞానమువలన భ్రాంతుడవై, ఇంద్రియభోగములందు తగుల్కొని, మాయాఘాతమున అట్ట అడుగున పడిపోదువు. తరుణోపాయముదాపున సూటిగనున్నను, మాయ మానవులను మిగుల అంధులనుచేసి వైచును.

806. ఒక్కసారిగా జ్ఞానమును కఱపుటకు వీలులేదు. దానిని పొందుటకు కాలముపట్టును. తీవ్రస్వభావముగల జ్వరమున్నదనుకొనుడు. ఆస్థితిలో వైద్యుడు "కొయినాను" ఇయ్యడు. దానివలన లాభముండదని అతనికి తెలియును. ముందుగ జ్వరము రోగిని విడువవలెను. దీనికికాలము అవసరము. పిమ్మట "కొయినా" గాని మఱేమందుగాని ఇయ్య వీలుపడును. జ్ఞానమును బడయగోరు నరునిస్థితియు యిట్టిదే. నరుడు సంసారతాపత్రయములలో మునిగియున్నంతకాలమును ధర్మోపదేశములు వ్యర్ధములగును. కొంతకాలము సంసారవిషయముల అనుభవమునుపొందనీయ వలెను. వానిసంసారప్రీతి ఒకింత తగ్గిన వెనుక ధర్మోపదేశములు వానియందుఫలించు స్థితి వచ్చును. అంతవఱకును వానిగూర్చిచేసిన ఉపదేశములన్నియు వ్యర్ధములే!

807. సంధ్యగాయత్రియందు లయమందుచున్నది. గాయత్రి ప్రణవమున లయమగుచున్నది. ఈ ప్రణవము సమాధియందు లయముగాంచుచున్నది. ఇటుల (సంధ్యావందనాది) కర్మయంతయు సమాధియందు పరిసమాప్తిపొందుచున్నది.