పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

4

12. ఈ కలియుగములో జ్ఞానయోగము అత్యంత దుర్లభము. ఏలయన? మొట్టమొదట ఈయుగములో మనము అన్నముపై నాధారపడి యున్నాము. (అన్నగత ప్రాణులమై యున్నాము.)

రెండవది: ఈయుగములో నరుని జీవితకాలము జ్ఞానసాధనకు ఎంతమాత్రము చాలదు.

మూడవది; ఈయుగములో మనలనంటుకొనియున్న దేహాత్మబుద్ధిని[1] వదలిచుకొనుట దుస్సాధ్యము.

జ్ఞాని ప్రాపింపవలశిన పర్యవసాన మిట్లుండును. "నేను శరీరమునుకాను. అవ్యయమై నిరామయమై పఱగువిశ్వాత్మను నేను. నేను శరమునుకాను, కావున శరీరబాధలగు ఆకలి, దప్పి, పుట్టువు, చావు, రోగము మున్నగునవి నన్ను బాధింపజాలవు” అను నిశ్చయ జ్ఞానమే పరమ ప్రాప్యము.

దేహబాధలకు లోనైయుండియు నేను జ్ఞానినని చెప్పుకొనునతడు యెట్టివాడనగా, ముండ్లు గ్రుచ్చుకొని చేయి చీరుకొనిపోయి నెత్తురుకారుచుండగా మితిమీరిన బాధ ననుభవింపుచును "చూడుడు! నాచేయి చీరుకొనిపోలేదు శుభ్రముగానున్నది" అని పలుకునాతని వంటివాడు. .

ఇట్టి కబురులు పనికిరావు. అముండ్లన్నియు మొట్టమొదట జ్ఞానాగ్ని చేత భస్మమైపోవలయును సుడీ!

  1. నేను దేహమునే అనుభావమును.