పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/148

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

139

21వ అధ్యాయము.

తబుద్ధిమంతుడైనను, ఎంతమెలకువతో మెలగువాడైనను, నరుడు స్త్రీజనము నడుమ వసించునెడల, ఏకొలదిగనైనను కామచింతలు వానిమనస్సున పొడసూపుట నిశ్చయము.

409. యౌవనవంతుడగు ఒకశిష్యుని సందర్భములో శ్రీపరమహంసులవారిట్లనిరి. వానిముఖమున పతితచిహ్నములు చూపట్టుచున్నవి. నల్లనిపొఱయొకటి వానిమోమున ఆవరించినది. ఇదంతయు వానియుద్యోగబాధల వలన సంభవించుచున్నది. జమాఖర్చులెక్కలు, మరియిట్టివెన్నియో విషయములు వానిని ఆవరించివేసినవి."

410. ధనము నీకు తిండినిమాత్రమే ప్రసాదించ గలదు. అదియొక్కటియే నీజీవనగమ్యమును పరమలక్ష్యమునని తలపోయకుము.

411. ఒకతడవ శ్రీపరమహంసులవారు తరుణవయస్కుడగు శిష్యునొకని చూచి "పామర జనునివలె నీవు డబ్బుపుచ్చుకొని ఉద్యోగముచేయప్రారంభించినాడవు. నీతల్లికొఱకై నీవు పాటుపడుచుంటివి. అటులకానియెడల ఛీఛీ! ఛీఛీ! అనియుందును." అని నూరుసార్లు పదే పదే పలికినారు. తుదకు "నీవు భగవత్సేవ యొకటియే చేయుముసుమీ!" అని పలికిరి.

412. కామినియు కాంచనమును నరులను నారాయణుని నుండి వేఱుచేసి, సంసారమున ముంచివేయునని జ్ఞప్తినుంచుకొనుడు. మంచిదిగాని, చెడ్డదిగాని నరుడు తన భార్యను పొగడుచునేయుండుట కడుచిత్రము.