పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/108

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

99

12వ అధ్యాయము.

గముకారణశరీరమును బోలును. మనస్సునుదానిపైనిలుపుటవలన ఏకాగ్రశక్తిత్వరితగతిని అలవడును. ఈనీలాంశమును ఆవరించు ప్రకాశవంతమగుభాగము సూక్ష్మశరీరమును అనగా మానసికశరీరమును పోలును. దానివెలుపల స్థూలశరీరమునకు పోల్చదగిన కోశముండును.

296. ఏయింటిలోనివారు మెలకువతోనుందురో ఆయింటిలో దొంగలు చొఱజాలనివిధమున నీవుజాగ్రత్తపూనియుండిన యెడల నీమనస్సున చెడుతలంపులు ప్రవేశించి నీశీలమును హరించజాలవు.

297. చెఱువునీటిపైని పాచిని యొక్కింత తొలగించినను తిరిగి క్రమ్ముకొని నీటిని కప్పివేయును. వెదురుతడికలుకట్టి దానిని రాకుండచేసినయెడల యిక అది క్రమ్ముకొనదు. ఎన్నడో ఒక్కసారి మాయను నెట్టివేసినను యదిమరలివచ్చి బాధించుచునే యుండును. భక్తిజ్ఞానములతో హృదయమును సంరక్షించినయెడల యది స్థిరముగా వెడలిపోవును. ఆయొక్క విధానమాత్రమే నరునికి భగవద్దర్శనము కాగలదు.

298. ఒక కుటుంబములోని చిన్నకోడలు, అత్తకును మామకును సేవలుచేయుచు గౌరవించి, వారియెడల అవిధేయురాలుగాక నిరసనజూపక వర్తించును; అయినను తన పెనిమిటిని అందఱికంటెను హెచ్చుగాప్రేమించును. అటులనే నీ యిష్టదైవమునెడల ప్రత్యేకముగ స్థిరభక్తివహించియు, యితరదైవముల నిరసింపక, ఎల్లరను గౌరవించుము. వారంద