పుట:Shodashakumaara-charitramu.pdf/131

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

షోడశకుమారచరిత్రము


శా.

ఓయన్నా! జమువీటికిం బయన మై యున్నాఁడు నాపట్టి నా
కాయం బుద్ధురవేదన న్నిలువ దింక న్నాధనం బేల (పో
వే యంచున్) నెలుఁగెత్తి యేడ్చుటయు నిర్వేదంబునం బొంది యే
నాయంబం గృపఁ జేరి కన్నుఁగవనీ రందంద చే నొత్తుచున్.

10


వ.

తత్పుత్రమరణోద్యోగంబునకుం గారణం బేమి యని యని యడిగిన.

11


సీ.

ఈవీటిరా జగుదేవసేనుతనూజ
        దుష్టలబ్ధాఖ్య యద్భుతవిలాస
సంపూర్ణయౌవనోజ్జ్వల పురిఁ గలయట్టి
        కొమరుల నిచ్చ యొక్కరునిగాఁగ
బలిమిమై నయ్యింతి పిలిపించికొను నందుఁ
        బోయినవా రెల్లఁ బొలిసిపోవ
నింతకుమున్న యనేకులు చనిరి నా
        వరతనూజాతునివరుస నేఁడు
దీని వల దని మాన్పంగ దిక్కు లేదు
నింతతోడ మాసంసార మెల్లఁ దీఱె
ననుచుఁ గ్రమ్మఱ నెలుఁ గెత్తి యడలుటయును
నభయహస్తంబు నిచ్చి యి ట్లంటి నేను.

12


క.

నీకొడుకుఁ గాచి యీరే
యాకన్నియపాలి కేన యరిగెద నింకన్
శోకంబు మాని నెమ్మి న
నాకులగతి నుండవమ్మ యని పలుకుటయున్.

13