ఈ పుట ఆమోదించబడ్డది

తకఝణుత, ఝణుతతక, తకిటతది గిణతొత
గిణతొ తదిగిణతొ యను రణనములు మీఱంగఁ
ప్రతిగజ్జె యెడఁదలో భావములు బులకింపఁ
ప్రతిభావమున రసము వాఱిదిక్కుల ముంప.

ప్రియురాలి యూరువులు బ్రేరేప చషకమ్ము[1]
పయి మందవలితమ్ములయి లేచు దరగలటు
బాలేందుఫాల, నగబాల, పార్వతి నిలిపి
లీలావిపర్యాప్త రేచితభ్రూలతలు[2]

పరివాహితము శిరము[3], చిఱునవ్వు, నెత్తమ్మి
విరికన్నుఁ గవలందు విభ్రమాలోకితము[4]
కించిదాకుంచితము, చంచలము, బొమదోయి
పంచాస్త్రుబాణమ్ము, పర్వతేశ్వరు సుతకు

  1. ఆమె లేచిత భ్రూలతలు బాల లలితముగ వగుపడినవి అవి యెట్లున్నవనగా, ప్రియురాలు ప్రియునకు మధ్య మదించునపుడు ఆమె యూరువులచేత వామద్యపాత్రమున లేచు మద్య తరంగము లంత లలితముగ నున్నవి.
  2. అందముగ మీది కెత్తబడినవి.
  3. వింజామరమువలె ఇరుప్రక్కలకు వంచు శిరస్సు పరివాహితము.
  4. తిరుగుడు గల చూపు ఆలోకితము.