ఈ పుట ఆమోదించబడ్డది

పరివాహితముఁ [1] జూపి పైపైనిఁ కాంతమ్ముఁ
పరగించి చూపు భావావేశ మధురమ్ము
నటుదూగి యిటుదూగి చటులమ్ము గజకృత్తి
నటనమధ్యమ్ములో నయముగాఁ గడకొత్తి

యాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

ఒకకాలు వెనుకకై యొకకాలు ముందుకై
మొకమెల్లఁ జిరునవ్వు మురిపెముల ముద్దయై
గుడిచేతి యందు లఘుకోణత్వము ఘటించి
యొడికంబుగాఁ దలముఁ బడగవలెఁ కుంచించి
పెరచేత గురుకోణ మరుదుగాఁ దావలచి
కరశాఖలను వంచి శిరము వెన్కకుమలఁచి
వెనుకఁజూచిన యప్డు వెన్నెలలు జిలికించి
మునుముజూచిన యప్డు ముద్దులే బండించి

యాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

హస్తంబు కనుదోయి కడ్డంబుగా నిలిపి
శస్తంబరాళంపు[2] సంజ్ఞ నెదురుగ మలపి
ధూతంబు శిరము[3] సాకూతంబు కనుచూపు

  1. చక్రాకారముగ ద్రిప్పఁబడు శిరము పరివాహితము.
  2. పతాకమున జూపుడు వ్రేలు వంచిన అరాళ హస్తము.
  3. చూ: "ధూతమస్తకము చెల్వు."