ఈ పుట ఆమోదించబడ్డది
సమశీర్షకముతోడ[1] సమదృష్టి[2] ఘటియించి
సమపాద[3] విన్యాస చాతుర్యము లగించి
వరపతాకమ్ము[4] దాపటి కేల నెసకొల్పి
వామహస్తం బధో వక్త్రముగ సంధించి
త్రిపతాకమూని[5] యర్థపతాకమును[6] బట్టి
చపలదృష్టులు దిశాంచలములను మోపట్టి
ధూతమస్తము[7] జెల్వు దోబూచు లాడంగ
వీతరాగులు ఋషులు వినుతులను సేయంగ
నిలయెల్ల చెలువు రూపెత్తి నిల్చిన యట్లుఁ
గలలెల్ల నిజములై గానుపించిన యట్లు
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
హంసాస్యమును[8] రెండు హస్తంబులను నించి
అంసభాగంబులకు నానించి చూపించి
- ↑ క్రిందికిగాని, పైకిగాని, పంపక, యెత్తక, సమానముగా నుంచిన శిరస్సు.
- ↑ రెప్పపాటు లేని దృష్టి.
- ↑ సాధారణముగా నిలువబడినట్లుండును.
- ↑ అన్ని వ్రేళ్ళను చాచి, బొటన వ్రేలిని, చూపుడు వ్రేలి కడపటి గెణుపున కానించి చూపుట.
- ↑ పతాకహస్తమున అనామికను వంచి చూపుట.
- ↑ పతాకమున జిటికెనవ్రేలిని వంచి చూపుట.
- ↑ ఎడమ కుడిప్రక్కలకు గదలించెడు శిరస్సు
- ↑ నడిమివ్రేలు మొదలు మూడు వ్రేళ్ళను ఎడముగలవిగాజూచి యంగుష్టమును జూపుడువ్రేలితో జేర్చికట్టిన హంసాస్యము.