ఈ పుట ఆమోదించబడ్డది
అంగములు[1] గదురఁ బ్రత్యంగంబులునుఁ [2] జెదర
హంగునకు సరిగా నుపాంగంబులునుఁ [3] గుదుర
తత సమత్త్వాదు లంతఃప్రాణదశకంబు[4]
నతి శస్తములగు బాహ్యప్రాణ[5] సప్తకము
ఘంటాసదృక్కంఠ కర్పరము గానంబు
కంఠగాన[6] సమాన కరయుగాభినయమ్ము
కరయుగము కనువైన కనులలో భావమ్ము
చరణములఁ దాళమ్ము చక్షుస్సదృక్షమ్ము
ఒరవడిగ నిలువంగ నురవడిఁ దలిర్పంగఁ
బరవశత్వమున శ్రీపతియున్ జెమర్పంగ
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
- ↑ తల, చేతులు, చంకలు, పార్శ్పనులు, నడుము, పాదములు
- ↑ మూపులు,భుజములు, వీపు, కడుపు, తొడలు,పిక్కలు
- ↑ చూపు, రెప్పలు, నల్లగ్రుడ్డు, చెక్కిళ్ళు, ముక్కు, దవుడలు, అధరములు, దంతేములు, నాలుక, గడ్డము, మొగము, శిరస్సు
- ↑ పడి, నిలకడ, నమత, చపలత్వము, చూపు, శ్రమములేమి, బుద్ధి, శ్రద్ధ, మంచిమాటలు, పాట.
- ↑ మృదంగము, తాళము, వేణువు, పాట, శ్రుతి, వీణ గజ్జెలు, గాయకుడు
- ↑ కంఠముచేత గానమును, దానిలోని యర్థమును, హస్తాభినయము చేతను, బావమును, కంఠముచేత గానమును, దానిలోని యర్థమును, హస్తాభినయము చేతను, భావమును గనుల చేతను, లయను పాదముల చేతను జూపింప వలెనని నాట్య చార్య సంకేతము.