ఈ పుట ఆమోదించబడ్డది
భావపరిముగ్ధ గిరిజావనజతుల్యపదయావకరసాఽక్త శిరసం[1]
పీవరభుజం ప్రమథజీవనమముం సకలపావనతనుం హృదిభజే.
గంగాతరంగకణసంగ వికాసిజూటం
సంధ్యాంతరిక్ష మివ తారకితం[2] దధానః
నృత్యత్పదాఽగ్ర పరికల్పిత వేదజాతః
కుర్యాద్దయాం, త్రిభువనాఽఽలయదీపఏషః.
దధన్నేత్రం గౌరీ ప్రణయముకురం[3] మండనవిధౌ
ప్రసన్న స్మేరాఽస్యం లలితలలితం చాంద్రశకలం
మహాసంవిద్రూపం భుజగపతి భూషం శ్రుతిసతీ
వతంసం శంసామః కిమపి కిమపి బ్రహ్మసరసం.
గౌరీకటాక్ష రేఖా
చంద్రకితం[4] వక్ష ఆదధానాయ
పింగళజటా యనమో
గంగాకమనాయ, వేదవేద్యాయ.
- ↑ పార్వతీదేవి పదతామరసమునందలి లత్తుకచే రంజివబడిన శిరస్సు గలవాడు భరతశాస్త్రమందు "నిటాలతిలక" అను స్థానవిశేషము గలదు. ఆ యభినయమునందు బాదముతో దిలకముంచికొనునట్లు దానిని నిటలముపై నిలుపవలెను. పార్వతి యాయభినయమును జూపించుచుండగా నామె కాలు శివుని శిరస్సునకు దగిలినది. ఇద్దానినే "లలాట తిలక" మనియు వ్యవహరింతురు.
- ↑ నక్షత్రములచేత గూడినది.
- ↑ శివుని నేత్రములందు నీడ జూచుకొని పార్వతి తన యలంకారమును దిద్దుకొనుటచే, నతని నేత్రమామెకు లీలాదర్పణమైనది.
- ↑ నెమలి కన్నులవంటి కన్నులుగల.