పుట:Shathaka-Kavula-Charitramu.pdf/90

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండితారాధ్యులు.

13


పైయంతరువులోనిదేయనియంగీకరింపకపోరు. "శివుఁడు విష్ణువరేణ్యుఁడు గోవిందవరేణ్యుఁడు" నని యీతఁడు చెప్పుటలోఁ గ్రొత్తలేదు. కేవల వైష్ణవులు కానివా రందఱును శివాధిక్యము నంగీకరించుచున్నారు. పైసమాస మీయర్థమునఁ బొసఁగునా? "

భక్తిపై నీతఁడు వ్రాసిన రెండుమూఁడు పద్యములు శైలికిఁ జూపెదను.

క. ఒక్కం డీశ్వరుఁ డని మది
   నిక్కముగా నెఱిఁగి భక్తి నిష్ఠావృత్తి౯
   ముక్కంటి నిన్నుఁ గొలిచిన
   ద్రిక్కక దొరకవె సమస్తదివ్యసుఖంబుల్|| 99

క. అరుదుగ భవత్ప్రసాద
   స్ఫురణము దొరకొనుశివభక్తి గాన ధుస్తరభవని
   ష్ఠురదుఃఖసముద్రసము
   త్తరణవహిత్రంబు భక్తి దానయ్యె శివా! 107

క. వసుమతిఁ జిత్రము జితచి
   త్తసంభవా"నకర్మణావతపసానజపై
   ర్న సమాధిభిరవ్య యనీ
   య సదృశభక్తి”కినిఁ బ్రియుఁడ వగు దీశానా|| 111

కన్నడకవి చరిత్రమునందీతని గూర్చివ్రాసిన విశేషములు.

"ఇతఁడు(పండితయ్య ) గణసహస్రనామముఇష్టలింగ స్తోత్రము, బసవగీత మొదలగు గ్రంథములు వ్రాసినట్లు తెలియుచున్న ది. గురురాజు వ్రాసిన సంస్కృత పండితచరిత్రము (15వ శతాబ్దము) నీలకంఠుని యారాధ్యచరిత్రము (15 శతాబ్దము ) సిద్ధనంజేకునిగురురాజచరిత్రము (16 శతాబ్దము) ఇవి మొదలైన గ్రంథములయందీక్రిందియంశము లీతనిగుఱించి తెలియుచున్నవి. (ఇచ్చట మనకుఁదెలిసినవిషయములే వివరించిరి. ఈతఁడు బసవనిభస్మము నంది; కర్ణాటకభాష రా నందే పై గ్రంథముల వ్రాసెను. ఈతనిగణసహస్రనామము మాత్రము దొరుకుచున్నది. తక్కినవి దొరకలేదు. గణసహస్రనామము వెలనాటిచోడునిసభలో హరనింద విన్నదోషము, బౌద్దాచార్యులతో వాద , మొనరించినప్పుడు కలి