పుట:Shathaka-Kavula-Charitramu.pdf/67

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xl)


“ధూమజ్యోతిస్యలిలరుతా" సన్నివేశ మగుమేఘము తనవియోగదుఃఖమును బాపఁగల్గునా లేదా యను విచారము యక్షునకు లేనట్లె కామముచే నజ్ఞానుఁడైనట్లెయిచ్చట శతకములయందు భక్తుఁడును, సాకారుఁలగు రామకృష్ణాద్యవతారములుకాని యిష్టదైవ మగువిగ్రహముకాని తన్ను సంసారజలధీనుండి యుత్తరించి పరమాత్మనుండి తన కైనవియోగదుఃఖమును బాపఁగల్గునా? లేదా? యనువిచారముచేయక యక్షునివలెనే భక్తుడు భక్తిచే నున్మాదుఁడై (మోక్షకామియై) భగవదంశము గల విగ్రహమునుగూర్చి మొఱపెట్టుకొనును. మేఘము ప్రియురాలిని సందర్శింపవచ్చును. కాని మాటలాడలేదు. అట్లే విగహము జ్ఞానము కుదుర్చుటకు సాధనము కావచ్చును. కాని మోక్షము నీయలేదు. మోక్షసాధన మగుభక్తిజ్ఞానముల నీయవచ్చును. కాని మోక్షమీయఁ జాలదు, ఇచ్చట నేను వేదాంత ముపన్యసింపఁ దలంపలేదు. నేను చెప్పినయుపమానము నందలిసాధర్మ్యమును వెల్లడింపఁబూనితిని. ఇందువలన మనశతకముల యందలిభావోద్రేకమునఁ బుట్టియావేదనము వలనఁ గలిగినస్తుతియందు "లిరిక్కు"గుణ మున్నదని చెప్పఁగలిగితి నని తలంచెదను. అయితే మేఘసందేశమునందుఁ గర్త యగుకాళిదాసుకంటె వేఱుగ యక్షుఁ డనుపాత్రకలదు. యక్షుఁడే కవి యని నాయాశయము. కాని యది యట్లుంచుఁడు. శతకములలో రచయిత యగుకవియే పాత్ర. శతకము నందలిభక్తుఁడును, శతకమువ్రాసిన కవియు వేఱని చెప్పవచ్చును. పరమాత్మ కవి, జీవాత్మ భక్తుడు. భక్తుఁడో శతకము నందలిపాత్ర. యక్షునివంటి పాత్ర! అని సమర్థింపవచ్చు నన కొందును.

ఇట్లు సమర్ధించుటకుఁ దనకుఁ దానే సంబోధించుకొనినశతకము లుదాహరణముగఁ జూపవచ్చును. కవిచౌడప్ప ప్రసిద్దికొఱకును, బద్ది భూపతి కీర్తికొఱకును తమ్ముతామే సంబోధించుకొని శతకములు వ్రాసి రంద మనినను, వేమనవంటి విరాగమూర్తి “వినురా వేమా" అని సంబోధించుకొనుటకుఁ గారణము లరయవలయును. ఈసంబోధనములఁ జూచినకొంద ఱివి, వేఱుకవులు వారిపై వ్రాసిన వనియు