పుట:Shathaka-Kavula-Charitramu.pdf/54

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxvii)


గ్రంధములయందు భాస్కర, నారాయణ, వజ్రప జర, మరున్నందన సుమతిశతకాదులనుండి యుదాహరణము లున్నవి. వేలకొలఁదికూర్పు లచ్చుపడినదాశరధీ, సుమతీ, కుమారీ, వేణుగోపాల, చెంగల్వరాయ, నాయకీనాయక , కాళహస్తీశ్వర, భాస్కర, వేమన, మానసబోధ, తాడిమళ్లరాజగోపాల శతకములు ప్రజలయాదరణమును, వ్యాప్తిని సూచించుచున్నవి. ఐనను మనలాక్షణికులుసు చరిత్రకారులు నీశతక వాఙ్మయము నెట్టియాదరణబుద్దితోఁ జూచి రని విచారించిన మన యిప్పటిపండితులలోఁ గొందఱ కించుకగౌరవము తక్కువయున్నట్లు కనఁబడును.

లాక్షణికులలో నగ్రగణ్యుఁ డని యింతవఱకు మనవా రెంచిన యప్పకవి చాటుప్రబంధలక్షణము నిట్లు చెప్పియున్నాఁడు. మనకధలలో జాటుకవిత్వ మైనఁజెప్పుకొనలేక పోవునా? యని యీసడించినట్లు విందుము. అప్పకవిలక్షణము:- కావ్యభేదములు.

సీ. ఉచ్చారణక్రియ నొప్పారువర్ణంబు, వర్ణసంచయమున వరలుఁబదము
    పదవితాసంబుస భాసిల్లు వాక్యంబు, వాక్యభేదమున నివ్వటిలు నర్ధ
    మర్ధవశంబున నమరునుభావఁబు, భావసంగతిఁ గనుపట్టురసము
    రస సంప్రశక్తిచేఁ బొసఁ గును పద్యంబు, పద్యరాశినిగూర్పఁ బడునుగావ్య

తే. మట్టికావ్యంబు ద్వివిధమై యతిశయిల్లు, చిరువడిఁ బ్రబంధచాటు ప్రబంధములన
    సర్గముల సంస్కృతమున నాశ్వాసములను, దెనుగునఁ బ్రబంధమనునది తనరుఁగృష్ణ. 1-130

అని "ప్రప్పులో” నడుగువైచినాఁడు. “పద్యరాశిని” గూర్పబఁడును. గావ్యమనివేసినాఁడు.

ఇఁక నర్సభూపాలీయకర్త యేమనుచున్నాఁడో చూడుడు. “విగతదోషంబులును, గుణాన్వితము లధికలసదలంకార భావోపలక్షితములు నైన శబ్దార్ధములు కావ్యమనఁజెలంగు[1] అని శబ్దార్థసంఘటితమైన, వాక్యమైనచో గావ్యత్వము పట్టవచ్చునని సంస్కృతలాక్షణికులలో మమ్మటుని యభిప్రాయమును బతిథ్వనించి యున్నాఁడుకదా!

  1. "తదదోషౌ శబ్దార్థౌ సగుణావనలంకృతీ పునఃక్వాపి” కావ్యప్రకాశిక.