పుట:Shathaka-Kavula-Charitramu.pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxvi)

ప్రతిగ్రామమునందును లక్షణ మెఱిఁగినవా రందఱు నేదోయొక శతకము నయిన వ్రాసి యాయూరనున్న దేవుని కంకితముచేయుచు వచ్చిరి. కావున మనదేశమునందు దేవాలయము లెన్నికలవో శతకము లన్నిఁటికి ద్విగుణముగనైనఁ గలవనుట తప్పుకాదు.

19వ శతాబ్దమునందును శతకములు విరివిగనే పెరిగినవి. ఇందువలన 17, 18, 19 శతాబ్దముల యుదుఁ బుట్టినశతకములు కొన్నిలక్ష లుండు నని తోఁచుచున్నది. వేదాతశతకములు, ఉత్సాహవృత్తశతకములు, పద్యలక్షణములు లేనిశతకములును గొన్నివేలు పెరిగినట్లు కనఁబడుచున్నది. ఇందువలన మన కున్నశతకములకంటెఁ బోయినవే యధికముగఁ గన్పట్టుచున్నవి. తాళపత్రగ్రంథములలోఁ బ్రతిదినము ప్రాఁతశతకములు నూతనముగఁ గనబడుచునే యున్నవి. పరిషత్తు, ప్రాచ్యలిఖితపుస్తకాగారము, అడయారుపుస్తకాలయములలో రమారమి 300 శతకములు వ్రాఁతశతకము లున్నవి. నాకడ నచ్చుపడినవి 300 కుఁబైఁగా నున్నవి. నాకుదొరకని వెన్నియున్నవో! మన కీవఱకు 600 శతకములకంటె నధికముగఁ గనఁబడుచున్నవి.


శతకముల యాదరణము

పూర్వము మనప్రభువులును, ప్రజలును, లాక్షణీకులునుగూడ మనప్రాచీనశతకముల నాదరణబుద్ధితోఁ జూచినట్లు పెక్కునిదర్శనము లున్నవి. శతకము లాశువునఁ జెప్పించి బహుమానము లిచ్చిన ప్రభువు లున్నారు. తమపై శతకములఁ జెప్పించుకొన్న ప్రభువులు మంత్రులుకూడఁ గనఁబడుచున్నారు. ఒంటిమెట్టరఘువీరశతకము, ఆర్యాశతకము, పాపయ్యమంత్రి శతకము, పొణుగుపాటివెంకటమంత్రి శతకము, బుఱ్ఱావెంకనమంత్రిశతకము, ఎరగుడికన్నశతకము, గువ్వలచెన్నశతకము, కృష్ణభూపతిలలామశతకము మొదలగున విందులకు నిదర్శనములు. అప్పకవీయము, రఁగరాట్చందము మున్నగు లక్షణ