పుట:Shathaka-Kavula-Charitramu.pdf/480

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమలాపురపు సన్యాసికవి.


ఈకవి శతశతకములు వ్రాసెనట. విశాఖపురమండలములోని పాలతేరు వాస్థవ్యుడు. కుమ్మరికులమునకు జెందినవాడు. విప్రులీతని శిష్యులుగా నుండుటయే యీతని పాండిత్యము జగద్విదిత మైనదని వెల్లడించుచున్నది. ఈతడు శా.శ. 1682 క్రీ. శ. 1760లో మృతినొందెను. ఈతని శతకము లైదాఱు చిక్కినవి. వీనియందు భాష యనవసరముగ నియమబద్ధమై కవిత కుంటుపడియున్నది. శైలికి గొన్నిపద్యముల జూపెదను.