పుట:Shathaka-Kavula-Charitramu.pdf/449

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వంకాయలపాటి వేంకటకవి


ఇతడు గోదావరిమండలము లోనికోలంకవాస్థవ్యుడు. ఇత డనేకకృతులు వ్రాసెను. అందు మదనగోపాలశతక మొకటి. ఈశతకము వేణుగోపాలశతకము వంటినిందాగర్భకావ్యము. కొన్ని మోటు పదము లున్నవి. కవి రమారమి క్రీ.శ. 1800 ప్రాంతమువా డని వినియున్నాను. శైలితెలియుటకు గొన్ని పద్యముల జూపెదను. ఈతడారువేలనియోగి బ్రాహ్మణుడు. ఆపస్తంబసూత్రుడు, గౌతమిగోత్రుడు. వెంకయ కామమాంబల పుత్రుడు. గుండు వేంకటరాముని శిష్యుడు. పంచాక్షరీసిద్ధి కలవాడు. శైవ వైష్ణవ సదాచారరతుడు.