పుట:Shathaka-Kavula-Charitramu.pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(viii)


నున్న సంప్రదాయము లిప్పటికి మనశతకములలో నుండుట యాశ్చర్యజనక మైనవిషయము,

సంస్కృతశతకములు.

ఆర్యులజీవితము వేదమంత్రములతో నారంభమైనట్లు మనకుఁ దెలియును. అందువలననే మనకు వేదము లనాదియైనవి. అవి యపౌరషేయములుగా మనవారు పరిగణించిరి. ఆర్యులమతము, దినచర్య యివి వేదానుసారములు. వేదవిరుద్ద మైనమతముల కార్యావర్తము చోటీయలేదు. వేదములు భక్తిప్రతిపాదకము లైసమంత్రములు, స్తుతులు, ప్రార్థనలతో నిండియున్నవి. వీనికిఁ బిమ్మటఁ బుట్టినవేదాంతము లగునుపనిషత్తులు వానిసారములయినను వేదమునందు భక్తి ప్రధానముగఁ గనఁబడును. భగవత్ప్రీతికై స్తోత్రములు, తదనుగుణ్యముల గుజవతపములు, మంత్రములు, కర్మలు, కసఁబడుచున్నవి. మంత్రములు, శాస్త్రములుగాను, పార్థనలు క్రమముగా నుపనిషత్తులుగాను మారుటకుఁ గొంతకాలము పట్టినదని విమర్శకు లంగీకరించినవిషయమే కాని వేదకర్మలుమాత్రము నేటికిని జరుగుచునేయున్నవి. యథా రూపముగ నిప్పటికి వానియధికారము సాగుచున్నది. ఈ వేద స్తుతులయందే భక్తిభావముల కనుగుణముగఁ బుట్టినశాంతులు, స్తుతులు, జప తపరూపము నొంది, మంత్రతంత్రములు క్రియలుగాఁ బరిణమించినవి. ఈకర్మలలోఁ గొన్నినియమములు నేర్పడినవి. " ఒక మంత్ర మిన్నిసారులు జపింపవలెను.” అని సంఖ్యాబద్దములైనవి. తాంత్రిక వాఙ్మయముకూడ శతక వాఙ్మయమునకుఁ బోషకమైనది. వానికారణములతో మనకిచ్చటఁ బ్రసక్తిలేదు. ఆప్టోత్తరశతకమనునది మనకు మిక్కిలిపరిచయ మగుమాట. ఒకమంత్రముకాని, ఒక నామముకాని, స్తుతికాని, 108 మారులు జపించుటవలన లాభ మున్నదని మసపూర్వులగు తాంత్రికులును దలంచిరి. 108 ప్రదక్షణములు, 108 సూర్యనమస్కారములు, పురశ్చరణలు నియమించిరి. జపమాలయందుఁ