పుట:Shathaka-Kavula-Charitramu.pdf/34

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(vii)


ఇట్టివి 96 గ్రంథములం గూర్చి సతీశచంద్రవిద్యాభూషణుఁ డొక గ్రంథపీఠికలో నుదాహరించియున్నాడు. (ఆతని స్రగ్ధరాస్తోత్రము. పీఠిక చూడుఁడు.) ఈస్తోత్రములలో 62 టిబెటు భాషాంతరీకరణము లగపడుచున్నవి. (G. K. Narayan in his Literary History of Sanskrit Buddhism.)

[వింటర్నిజు, సిల్వెయినులెవి, హ్యూంబరు, మొదలగు పండితులవ్రాతలనుండి తీసినసారాంశ సంగ్రహము.]

ప్రాకృతములనుండి తెనుఁగులోనికి భాషాంతరికరించిన గ్రంథములు తక్కువ. శృంగారసప్తశతినుండి శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారివి యెండు రెండుభాషాంతరీకరణ పద్యములను జూపెదను. శృంగార సప్తశతి యనేక కావ్యములకూర్పు.

కుందవుత్రుఁడు.

ఆ. లోభివానిచేతి లోసిరిపెరిగిన, ఫలమొకింతయైనఁ గలుగఁబోదు
     తెరువునడుచువేళ గఱకువేసవియెండ, మాఁడువానికిఁ దన నీదవోలె. 26

హాలుఁడు.



క. చెలులు కడుజాణ లాతఁడు, వలపుల దాఁచుకొనలేని వాఁడిఁక నేని
   గ్గులదానను నాపాదం బుల లత్తుకవన్నె లేల పూసెదుపోవే; 27

మనశతక వాఙ్మయమును పైవిషయములతోఁ బోల్చిచూచుకొనినచో ననేక వందలసంనత్సరముల క్రితము బహుశః ఆంధ్రభాషకుఁ దొలిరూపమైన పాకృతవాఙ్మయచ్చాయ లిప్పటికిని మనశతకవాఙ్మ యమునఁ జిహ్నిత మైయున్నవి. కాఁబట్టి మనశతకములు - చిరకాల సంప్రదాయము(Tradition)ను ననుసరించియే పెరుగుచున్నవి. ప్రాకృతమే యాంధ్రభాష తొలిరూపము కాదనువా రున్నచో వారు జైనులను, వారిదేవాలయములను, వారివాఙ్మయస్వరూపములను నాశన మొనర్చి శైవులు తమవానిగాఁ జేసికొని రట్టిసమయమున జైనులప్రాకృతవాఙ్మయమునుండి శతకస్వరూపమును దీసికొని రని యంగీకరింపకపోరు. ఏది యెట్లున్నను క్రీస్తుపూర్వము ప్రాకృతములో