పుట:Shathaka-Kavula-Charitramu.pdf/32

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(v)


కథ క్రీ. శ. 265 నాఁటికే చీనాభాషలోనికి బరివర్తించినట్లు ప్రబల నిదర్శనము లున్నవి. (54, 55 పుటలు)

"కల్పద్రుమావదనమాల” యనునది యవదానశతకమునుండి కథలు తీసి కూర్చినమఱియొక గ్రంథము. ఇట్టివే యశోకావదనమాల, రత్నావదనమాలయు ననికూడ నున్నవి. ఇవి పురాణసంప్రదాయము చొప్పున నున్నవి. ఇందలిశ్లోకములు నట్టివ!

ఇవి యన్ని యు లిఖితగ్రంథములు. అచ్చు కాలేదు. కొన్నిఁటికి టిబెటు, చీనా భాషాంతరీకరణములు మాత్రము ముద్రితములై యున్నని.

శైవ వైష్ణవమహాత్మ్యాములు స్తోత్రములును దెల్పుకొన్ని భాగములు పురాణములయం దున్నట్లే బుద్ధదేవునిస్తోత్రములు కొన్ని కలవు. [1]

ఇవి వేఱు వేఱు కావ్యములే. కొన్ని గ్రంథములలోని కేక్కీనవి. కళ్యాణపంచవింశతిక , లోకేశ్వరశతకము, సుప్రభాతస్తవము, పరమార్థనామసంగీతి, మొదలగున వీమాదిరిది. ఇందు కళ్యాణపంచవింశతిక అమృతానందుఁడు 25 స్రగ్దరలలో వ్రాసెను. లోకేశ్వరశతకము వజ్రదత్తుఁ డనుకవి నూఱుశ్లోకములలో లోకనాథుని స్తుతించుచు వ్రాసెను. శాక్యముని, బుద్దులు, బోధిసత్వులస్తుతి నలువదితొమ్మిది శ్లోకములలో నున్నదానినే సుప్రభాత స్తవముందురు. భగవద్గుణ విశేష స్తవముకలది పరమార్థనామసంగీతి. .

అవలోకితేశ్వరునిభార్య యగుతారాదేవినిగురించిన వనేక స్తుతులున్నవి. . ఇవి మిక్కిలి పవిత్రమైనవి. సర్వజ్ఞ మిత్రుఁ డనుకా

  1. మనకిట్టి పురాణస్థస్తోత్రములు శతకములుగా నున్నట్లు కీర్తిశేషులైన దాసు శ్రీరాములుగారి దేవీభాగవతమునందుఁ జూడనగును.